12-01-2026 08:58:09 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జ్యోతి నగర్ లో ఉన్న విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, యువజన సంఘం అధ్యక్షులు మాదాసు సంజీవ్, అసెంబ్లీ కన్వీనర్ పెంట శ్రీనివాస్ తో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం దొగ్గలి శ్రీధర్ మాట్లాడుతూ... భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గురువు తన ఉపన్యాసంతో జగతిని జాగృతం చేసిన మహా మేధావి భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి, లేవండి మేల్కొనండి గమ్యం చేరేవరకు విస్తమించకండి అని యువతను మేల్కొల్పిన మహా వ్యక్తి అందుకే ఆయన జయంతి రోజున జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.