12-01-2026 05:23:10 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ హాయ్యుం సోమవారం విడుదల చేశారు. బిచ్కుంద మున్సిపాలిటీకి 12 వార్డుల గాను మొత్తం 12,759 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 6,201, మహిళలు 6,556, ఇతరులు ఇద్దరు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఓటర్ల నుంచి వచ్చిన 99 అభ్యంతరాలను పరిష్కరించి జాబితా రూపొందించామన్నారు. ఓటింగ్ కోసం పట్టణంలో 24 పోలింగ్ కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు.