హైదరాబాద్: మంచిర్యాల ఎంసీహెచ్ ఆస్పత్రిలో కరెంట్ కోతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కరెంట్ లేకపోవడంతో బాలింతలు, శిశువులకు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్య పరిష్కరించాలని హరీశ్ రావు కోరారు. మాత శిశు హాస్పిటల్లో కరెంట్ లేక బాలింతలు, చిన్న పిల్లలు ఇక్కట్లు పడ్డారు. వరస కరెంట్ కోతలతో బాలింతలు, చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.