calender_icon.png 15 October, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరితహారం చెట్లు నరికివేత

14-10-2025 01:09:55 AM

మరిపెడ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): హరితహారం కార్యక్ర మంలో పెంచిన మొక్కలను నరికి వేస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచిలి తండా గ్రామపంచాయతీ పరిధిలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో హరితహారం మొక్కల పెంపకం చేపట్టి చెట్లుగా ఎదగడానికి కృషి చేశారు. అయితే ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో హరితహారం లో నాటిన మొక్కలు చెట్లుగా పెరిగి నీడనిచ్చే సమయంలో గొడ్డలి వేటుకు గురవుతున్నాయి.

హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ మొక్కలు చెట్లుగా ఎదిగి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా ప్రజాధనం వృధా అవుతుందని పలువురు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మొక్కలు నాటే సమయంలో తగు జాగ్రత్త లు తీసుకొని మొక్కలు నాటితే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందనీ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరికిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.