25-01-2026 12:00:00 AM
ఖైరతాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): నిమ్స్ కార్డియోవాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జరీ(సీవీటీఎస్) విభాగం ఆధ్వర్యంలో సీవీటీఎస్ బూట్ క్యాంప్ 2026 నిర్వహిస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ క్యాంప్ నేడు కూడా జరగనుంది. నిజాం మనవడు నవాబ్ నజాఫ్ గఢ్ అలీ ఖాన్, లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీ హెల్త్ అండ్ మెడిసిన్ వింగ్ డీన్ డాక్టర్ అభాచంద్ర ముఖ్య ఆహ్వానితులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లా డుతూ బూట్ క్యాంప్ శిక్షణను వాస్త వ శస్త్ర చికిత్స అనుభవంతో అనుసంధానిస్తున్నాం అన్నారు. మార్గదర్శనంతో పాటు సమన్వయపూర్వకంగా నేర్చుకునేలా హాజరైన వారిని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప, సీవీటీఎస్ విభాగాధిపతి డాక్టర్ ఎం. అమరేశ్ రావు,డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, సూపరింటిండెంట్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ తదితరులున్నారు.