02-05-2025 01:56:47 AM
న్యూఢిల్లీ, మే 1: పదకొండు సంవత్సరాల తర్వాత కేంద్రం అనూహ్యంగా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఈ భేటీ జరగనుంది.
తదుపరి నిర్వహించే జనగణనలోనూ కులగణన కూడా నిర్వహించా లని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కులగణన చేయడం స్వాతంత్య్రానంతరం ఇదే మొదటిసారి. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు.
కేంద్రం ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే కులగణన నిర్ణయం తీసుకుందన్నారు. గతేడాది కేంద్రం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులాగే ఈ ఆంశం కూడా మూలన పడే ప్రమాదం ఉం దని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యేందుకు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సమావేశానికి కాం గ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా హాజరవనున్నారు.