02-05-2025 01:46:41 AM
ముంబై, మే 1: త్వరలోనే వేవ్స్ అవార్డులను ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం ఆయన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంట ర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను ప్రారంభించారు.
ఈ సమావేశానికి ప్రపంచ నలుమూ ల నుంచి 100 మంది ఆర్టిస్టులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. ముంబై వేదికగా నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రారంభించిన అనం తరం ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఇండియా ఎంటర్‌టైన్‌మెం ట్ హబ్‌గా మారుతోంది. ఆరెంజ్ ఎకానమీకి భారత్‌లో నాంది పడింది.
సృ జనాత్మక కేంద్రంగా త యారై కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి. సంప్రదాయ, నవతరాలను సమన్వయం చేయాలి. సినిమాల వల్ల భారతదేశ ఘనత నలుదిశలకు వ్యాప్తి చెందింది. కంటెంట్ క్రియేటర్లను మా ప్రభు త్వం ప్రోత్సహిస్తుంది. సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి. భారత్‌లో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి.
ఒక్కో గ్రా మానికీ ఒక్కో కథ ఉంది. దేశంలోని నదులకు గేయాలు ఉన్నాయి. భారతదేశం విభి న్న సమాజాల సమాహారం. వేవ్స్ అనేది కే వలం కొన్ని అక్షరాల సమాహారం మాత్రమే కాదు. సంస్కృతి, సృజనాత్మకత, సార్వత్రిక అనుసంధానం’ అని మోదీ పేర్కొన్నారు.