12-10-2025 02:42:06 AM
న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు నైతిక విలువలు కాపాడాలి
హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
భువనగిరి కోర్టు నూతన భవనాలకు శంకుస్థాపన
రూ.86 కోట్ల అంచనాతో 6 అంతస్తుల నిర్మాణం
యాదాద్రి భువనగిరి/మంచిర్యాల, అక్టోబర్ 11 (విజయక్రాంతి): న్యాయ వ్యవస్థ ప్ర తీ పౌరుడికి సమానమేనని, ప్రజల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉన్నద ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో నైతిక విలువను కాపాడాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రూ.86 కోట్ల అంచ నాతో 6 అంతస్తులు నిర్మించనున్న జిల్లా కోర్టు నూతన భవనాలకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ భువనగిరి హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న నేపథ్యంలో కోర్టులపై భారం అధికంగా ఉంటుందని, దీనికి సాంకేతికంగా ఇతరుల వనరులపరంగా ఎంతో అవసరం ఉంటుందని, త్వరగా భవన నిర్మా ణం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యం గా న్యాయ వ్యవస్థలు రాజ్యాంగ లక్షణాలను చేరుకోవడానికి, ప్రజలకు న్యాయం అందించడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయశాఖలోని ఉద్యోగులు చిత్తశుద్ధితో, నైతిక విలువలు కాపాడుతూ కృషి చేయాలని చీఫ్ జస్టిస్ చెప్పారు.
వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉంటే తద్వారా దేశం పురోగమిస్తుందని, దేశ సాయుధ దళాలు జాతి రక్షణ కోసం ముందుండి దేశ సేవ చేస్తున్నాయని, వారిని మనం ఆశయంగా తీసుకోవాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అనుసరిస్తూ మనం సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉన్నత న్యాయ స్థాన న్యాయమూర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్మినిస్ట్రేట్ న్యాయమూర్తి కె.భరత్, ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు, జి ల్లా న్యాయమూర్తి తదితర అతిథులను సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.
యాదాద్రి నరసింహస్వామి సేవలో ప్రముఖులు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ హై కోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ దర్శించుకున్నారు. వారితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్ ’ జస్టిస్ కె.శరత్, జస్టిస్ కె.సుజన, జస్టిస్ వి.రామకృష్ణా రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి స్వామి వారి ప్రసాదం, ఫొటో అంజేశారు. కార్యనిర్వాహణాధికారి జి.రవి ఆధ్వర్యంలో స్వామి వారి దర్శన ఆశీర్వచన ఏర్పాట్లు చేశారు.
న్యాయ సేవలన్నీ ఒకేచోట
మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న న్యాయస్థానం భవన సముదాయ నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నగేష్ భీమపాక, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వీరయ్య, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మం చిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బం డవరం జగన్, న్యాయవాదులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మాట్లాడు తూ రూ.81కోట్ల అంచనాతో కోర్టు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. పోక్సో, ఫ్యామిలీ కోర్టులను కలుపు కొని 10+2 కోర్టులతో భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అనంత రం వివిధ న్యాయ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదుల ఆధ్వర్యంలో హైకోర్టు న్యా యమూర్తిని సన్మానించారు.