12-10-2025 02:38:50 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని బీసీ సంఘాలు తేల్చిచెప్పాయి. బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు, బీసీ సంఘా లు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏ ర్పాటు చేయాలని, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని తీసు కెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశాయి.
శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కళింగ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ‘బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, పరిష్కార మార్గాలు, భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై అఖిలపక్ష, బీసీ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ.. బీసీల సమస్య తప్ప చాలా సమస్యలను బీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీ పరిష్కా రం చేశారని ఎద్దేవా చేశారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు ఎంపీ లక్ష్మణ్ చొరవ తీసుకోవాలని కోరారు.
సీఎంతో అన్ని పార్టీలు, బీసీ సంఘాలు కలిసి మోదీని కలుస్తాయని పేర్కొన్నారు. బీసీ సమాజం రోడ్ల మీ దకు వస్తే పరిస్థితి వేరే ఉంటుందని హెచ్చరించారు. కులాల వారిగా విడిపోతే రాష్ట్రంలో సమస్యలు వస్తాయని, వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. కోదండరాం మాట్లాడుతూ.. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం రిజర్వేషన్లు దాటవచ్చని కోర్టులు కూడా చెప్పాయని గుర్తు చేశా రు. అందరిని ఐక్యం చేసి న్యాయపరమైన పోరాటం ఆపవద్దని సూచించారు. అన్ని ప్రజాస్వామ్య శక్తులు కలిసి రావాలని, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పారు.
ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ.. గవర్నర్ తో రాజకీయం చేస్తున్నారని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చి ఆమోదించడం లేదని మండిపడ్డారు. హైకోర్టు స్టే పై సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేస్తామని, అలాగే బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఇరావత్ అనిల్ అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీల మీద విమర్శలు వద్దని, రిజర్వేషన్లు అంశం క్షేత్ర స్థాయికి వెళ్లిందని, అందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు.
పోరాటం చేయాల్సిన సమయం: ఎమ్మెల్సీ అద్దంకి
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడు తూ.. బీసీలు ఇపుడు పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా బీసీ రిజర్వేషన్లుకు మద్దతు పలికారని చెప్పారు. కానీ బీసీ రిజర్వేషన్లుకు విలన్ ఎవ రో ప్రజలు చూస్తున్నారని చెప్పారు. కోర్టులో కేసులు వేసిన వ్యక్తులు చాలా చిన్నవాళ్లని పేర్కొన్నారు. జెఏసి ఏర్పాటు చేసి, ఐక్యంగా పోరాటం చేయాలని, అవసరమైతే బంద్‌కు పిలుపునివ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు విజిఆర్ నారగొని, దాసు సురేష్,ఇందిరా శోభన్, కుం దారం గణేష్ చారి, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వరి, ప్రొఫెసర్ నరేందర్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యాం కుర్మా, ఉప్పర శేఖర్ సగర, , దిటి మల్లయ్య, మురళీకృష్ణ, బర్ల మణిమంజరి సాగర్, గొడుగు మహేష్ యాదవ్, వరికుప్పల మధు, జిల్లెల నరసిం హ, దేశగోని సాంబశివ గౌడ్, కిరణ్ కుమార్, పిడికిలి రాజు, నరసింహ నాయక్, తారకేశ్వరి, సమత యాదవ్, శ్యామల, పాల్గొన్నారు.
నోటికాడి ముద్దను గుంజుకుంటారా?: వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత విహనుమంతరావు మాట్లాడుతూ.. చాలా రోజు ల తర్వాత బీసీలకు మంచి అవకాశం వచ్చిందని, బీసీల నోటికాడి ముద్దను గుంజుకో వడం భావ్యం కాదన్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన వాళ్లు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీసీ రిజ ర్వేషన్ల విషయంలో సీఎంతో మాట్లాడి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేలా కృషి చేస్తా నని చెప్పారు. బీసీగా ప్రధాని మోదీ ఉ న్నా బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోవ డం చాలా దురదృష్టకరమని పేర్కొన్నా రు. ప్రధానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లు అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు.