12-10-2025 02:28:02 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ‘యూపీఏ ప్రభు త్వం వ్యవసాయ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కార ణంగానే దేశంలో వ్యవసాయ రంగం బలహీనపడింది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగంలో గణనీయమై న సంస్కరణలు తీసుకొచ్చాం. కేంద్ర బడ్జెట్‌లో ఆ రంగానికి కేటాయింపులు పెంచాం. రైతులకు అండగా నిలిచేందుకు ఎరువులపై రాయితీలు పెంచాం.
తక్కువ ధరలకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందేలా చర్యలు తీసుకున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలనలో దేశంలో వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 900 లక్షల టన్నులు, పండ్లు, కూరగాయల ఉత్పత్తి 640 లక్షల టన్నులు పెరిగా యని వివరించారు.
లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్ జయం తి సందర్భంగా న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్‌లో శనివారం ఆయన రూ.24,000 కోట్ల తో ‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’, రూ.11,440 కోట్లతో ‘పప్పుధాన్యాల ఆత్మనిర్భర్ మిషన్’ పథకాన్ని ప్రారం భించారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు సంవర్థక, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి మరో రూ.5,4 50 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడు తూ.. ‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి పథ కం’ ద్వారా దేశ ఆహార స్వావలంబన సాధిస్తుందని, లక్షలాది మంది రైతులకు పకథం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పాతదకత పెరుగుతుందని, పంట ల వైవీధ్యీకరణకు ఆస్కారం ఏర్పడుతుదన్నారు. రైతులు సుస్థిరమైన వ్యవసాయ పద్ధ తులు అవలంబించేందుకు మార్గం సుగ మం అవుతుందని ఆకాంక్షించారు.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 ఆకాంక్షిత జిల్లా ల్లో నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపడతాయని వివరించారు. రైతులకు స్వల్ప కాలి క క్రెడిట్ లభ్యత అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అలాగే ‘పప్పుధాన్యాల ఆత్మనిర్భర్ మిషన్’ గురించి ప్రధాని వివరిస్తూ.. ‘రైతులు కేవలం గోధుమ, వరి సాగు కు పరిమితం కాకూడదు. పప్పు ధాన్యాల వినియోగం భారత్‌లో చాలా ఎక్కువగా ఉంది. అందుకు తగిన విధంగా ఏటా సాగు విస్తీర్ణం పెరగడం లేదు.
ప్రస్తుతం వాటి ఉత్పత్తి ఏటా 252.38 లక్షల మెట్రిక్ టన్ను లు మాత్రమే ఉంది. రైతులు పప్పుధాన్యాల ఉత్పత్తికీ ప్రాధాన్యమిచ్చి 2030 -31 ఆర్థిక సంవత్సరం నాటికి వాటి ఉత్పత్తిని 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలి’ అని పిలుపునిచ్చారు. పప్పుధాన్యాల ఉత్పత్తి ద్వారా భారత్ ఆహార భద్రత అంశంలో స్వావలంబన సాధిస్తుందని, ప్రజలకు పుష్కలంగా ప్రోటీన్ లభ్యత ఉంటుందని ఆకాంక్షించారు. పప్పుధాన్యాల దిగుమతికి ఇకపై భారత్ ఇతర దేశాలపై ఆధార పడకూడదని, 2030 నాటికి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 35 లక్షల హెక్టార్లకు పెంచాల్సిన అవసరం ఉం దని అభిప్రాయపడ్డారు.
రెండు పథకాలు రానున్న యాసింగి సీజన్ నుంచి అమలులోకి వస్తాయని వివరించారు. దేశాన్ని వికసి త్ భారత్‌గా మార్చడంలో రైతులు ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. ఇప్పటి వరకు రైతులు ఆహార స్వావలంబన కోసం కృషి చేశారని, ఇకపై ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడేలా వాణిజ్య పంటలు పండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.