calender_icon.png 29 July, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడింగ్ ప్రమోషన్ పేరుతో సైబర్ మోసం

17-12-2024 12:22:25 AM

గృహిణి ఖాతా నుంచి రూ.4.50 లక్షలు లూటీ

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సోషల్ మీడియాలో ట్రేడింగ్ ప్రమోషన్‌కు సంబంధించిన వీడియోలను లైక్, షేర్ చేయడం, రేటింగ్ ఇవ్వ డం వంటివి చేస్తే డబ్బులు ఇస్తామంటూ ఓ ఓ గృహిణిని నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.4.50 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ గృహిణి (40)కి ట్రేడింగ్ ప్రమోషన్ జాబ్ ఆఫర్ పేరుతో స్కామర్లు వాట్సాప్ మేసేజ్ చేశారు. వారు పంపిన వీడియోలు, ఫొటోలను లైక్, షేర్ చేయడం, రేటింగ్ ఇవ్వడం ద్వారా వాటి ని ప్రమోట్ చేయాలని పేర్కొన్నారు. ప్రారంభంలో స్కామర్లు బాధితురాలికి ఒక పనిని కేటాయించి దానికి 5స్టార్ రేటింగ్ ఇవ్వాలని చెప్పారు.

పని పూర్తిచేసిన తర్వాత ఆమెకు రూ.120 ఇచ్చారు. నిజంగా డబ్బులు వస్తున్నాయని నమ్మిన బాధితురాలు వర్క్‌లో జాయిన్ అవుతున్న ట్లు కన్ఫర్మ్ చేసింది. ఇందుకోసం స్కామర్లు ఆమెకు ఓ లింక్‌ను పంపించారు. జాయినిం గ్ ఫీజు రూ.1000 చెల్లించాలని సూచించారు. బదులుగా ఆమెకు రూ.1,300 ఇస్తామని హామీ ఇచ్చారు. వాగ్దానం ప్రకారం వారు రూ.1,300 తిరిగి చెల్లించారు. అనంతరం బాధితురాలికి పలు పనులను అప్పగిస్తూ పెట్టిన పెట్టుబడులకు లాభాలను అందించారు.

పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడితే మరింత సంపాదించొచ్చని ఆమెను నమ్మించారు. దీంతో బాధితురాలు మొత్తం రూ. 4.50 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. ఆ తర్వా త స్కామర్లు ఆమె మేసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానేశారు. మోసపోయానని గ్రహించినబాధితురాలు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.