25-07-2025 10:26:27 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలోని ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ నారాయణ కు గురువారం సైబర్ బెదిరింపులు కాల్స్ వచ్చాయి. డాక్టర్ క్లినిక్‌లో ఉన్న సమయంలో బెంగళూరు నుంచి పోలీసుల పేరుతో వాట్సప్ వీడియోకాల్స్ పదే పదే చేశారు. బెంగళూరులో మీపై 17 కేసులు నమోదయ్యాయని బెదిరించిన సైబర్ మోసగాళ్లు. మీ ఆధార్‌కార్డు దుర్విని యోగమైందని.. బెంగళూరు వచ్చి పోలీసుల ముందు హాజరు కావాలని హెచ్చరికలు చేశారు.
తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి గదిలో ఉండి ఒంటరిగా తమ విచారణలో పాల్గొనాలని బెదిరించిన సైబర్ నేరగాళ్లు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు డిజిటల్ అరెస్టు పేరుతో బ్లాక్‌మెయిల్ చేశారు. మీ పేరుపై ఉన్న మరో ఫోన్ నెంబర్‌తో చట్టవ్యతిరేక పనులు జరిగినట్లు బెదిరింపులలకు పాల్పడినట్లు డాక్టర్ నారాయణ కు తెలిపారు. మానవ అవయాలు కేసుతోపాటు పలుకేసులలో మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని డాక్టర్ నారాయణను బెదిరించారు. అయితే ఇంతవరకు కేసు నమోదు కాలేదు