25-07-2025 10:29:49 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): విద్యుత్ షాక్‌తో ప్రమాదవశాత్తు 6 గొర్రెలు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంమెట్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు బాకారపు మొండయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మెట్ పల్లి గ్రామానికి చెందిన బాకారపు మొండయ్య అనే గొర్రెల పెంపకం దారుడు గొర్రెలను మేత కోసం గ్రామ శివారు లోకి వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో మెట్ పల్లి గ్రామంలోని ఓ విద్యుత్తు పోలుకు బిగించిన సపోర్ట్ వైర్ ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో మేత మేస్తున్న 6 గొర్రెలు కరెంట్ షాక్ గురై గొర్రెలు మృతి మృతి చెందినట్లు వారు తెలిపారు. 6 గొర్రెల మృతితో సుమారు 70 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. బాధిత గొర్రెల పెంపకం దారుని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.