calender_icon.png 31 October, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్ట్‌టైం జాబ్ పేరుతో సైబర్ వల

26-09-2024 01:25:58 AM

బాధితురాలి ఖాతానుంచి రూ.1.26 లక్షల లూటీ

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : పార్‌టైం జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. తెలిసిన వివరాల ప్రకారం. నగరానికి చెందిన గృహిణికి పార్ట్‌టైం జాబ్ ఆఫర్ ఉందంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు. ప్రతి రోజు రూ.5వేల వరకు సంపాదించవచ్చంటూ నమ్మబలికాడు. దీంతో బాధితురాలు పెట్టుబడులు పెట్టి లాభాలు పొందింది. తర్వాత రూ.1.26 లక్షలు పోగొట్టుకున్నది. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.