12-10-2025 08:10:08 PM
కోనరావుపేట (విజయక్రాంతి): విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతుకు శాపంగా మారింది. కొనరావుపేట మండలం కోలనూరు గ్రామానికి చెందిన బుర్ర రవీందర్ అనే రైతుకు చెందిన పాడి ఆవు తన పంట పొలాల వద్ద గడ్డి మేయడానికి తీసుకెళ్లాడు. అక్కడ గడ్డి మేస్తుండగా అక్కడే వేలాడుతున్నా విద్యుత్ తీగలు ఆవుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అన్నారు. ప్రభుత్వం వెంటనే రైతుకు నష్టపరిహారం అందించాలని మాజీ సర్పంచ్ జవాజి తిరుపతి గౌడ్ కోరారు.