12-10-2025 10:33:35 PM
వందేళ్ల తర్వాత బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన..
ముగింపు ఉత్సవాలు హాజరైన ప్రముఖులు..
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితారెడ్డి..
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్..
ఎల్బీనగర్: హయత్ నగర్ గ్రామంలో వందేళ్ల తర్వాత జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. గురువారం నుంచి ఆదివారం వరకు బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు జరిగాయి. వందేళ్ల తర్వాత జరుగుతున్న ఉత్సవాలకు ప్రజలందరూ ఉత్సాహంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని వీధులన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. హయత్ నగర్ లో ఉన్న అన్ని దేవాలయాలు, గ్రామ దేవత ఆలయాల్లో మహిళలు బోనాల సమర్పించారు. 12న ఆదివారం చివరి రోజు బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠాపనతో ఉత్సవాలు ముగిశాయని హయత్ నగర్ బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
ఉత్సవాలకు హాజరైన ప్రముఖులు
హయత్ నగర్ లోని దసరా గుడి ప్రాంగణంలో జరుగుతున్న బొడ్రాయి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రముఖులు హాజరై పూజలు నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహరెడ్డి, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్లు సామ తిరుమల రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సాగర్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, వివిధ పార్టీల నాయకులు భాస్కర్ సాగర్, మల్లీశ్వరి రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, స్కైలాబ్, పారంద రమేష్, సాయిచంటి, టీ పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు, వడ్డేపల్లి శ్రీశైలం, చెన్నగోని రవీందర్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, పన్యాల జయపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి, నాయకులు సామ మహేశ్వర్ రెడ్డి, ధనరాజ్ గౌడ్, గణేష్ రెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, భీమిడి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.