calender_icon.png 13 October, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ కు రెండో ఓటమి..

12-10-2025 11:08:40 PM

ఐసీసీ మహిళాల క్రికెట్ ప్రపంచ కప్: విశాఖపట్నంలోని విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మహిళాల వన్డే ప్రపంచ కప్(ICC Womens ODI World Cup-2025)లో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని అందుకుంది. భారత్(India) నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా(Australia) జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో ముగించింది. దీంతో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ వన్డే చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డులకెక్కింది. భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండు గెలవగా, మరో రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. 

ఆస్ట్రేలియా నుంచి అలిస్సా హీలీ 107 బంతుల్లో 142 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా మహిళల టోర్నమెంట్‌లో వరుసగా మూడో విజయం సాధించారు. గాయపడి రిటైర్ అయిన తర్వాత ఎల్లీస్ పెర్రీ ప్రశాంతంగా ముగింపును కొనసాగించింది. తొలుత బ్యాటింగ్‌ కు దిగిన భారత్ 330 పరుగులకు ఆలౌటైంది.  భారత్ టాప్ ఆర్డర్ స్మృతి మంధాన 66 బంతుల్లో 80, ప్రతీకా రావల్(75) పరుగులతో రాణించారు. ఈరోజు మ్యాచ్ తో స్మృతి మంధాన తన ఇన్నింగ్స్‌ లో బహుళ రికార్డులను బద్దలు కొట్టింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో మహిళల వన్డేల్లో 1000 పరుగులు చేసిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఆస్ట్రేలియాపై మహిళల వన్డేల్లో అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన భారత క్రీడాకారిణిగా మంధాన నిలిచింది.