12-10-2025 10:36:42 PM
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ల పిలుపు..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో పల్స్ పోలియో..
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అన్ని డివిజన్లలో ప్రతి కాలనీలో ఐదేండ్లలోపు పిల్లలందరికీ వైద్యారోగ్య అధికారులు, సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యవంత జీవితానికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు.
మన్సూరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, జగదీష్ యాదవ్, రుద్ర యాదగిరి నేత, విజయ్ భాస్కర్ రెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో...
సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల, ఎస్ కే డి నగర్ డిపిఎస్ స్కూల్, టీచర్స్ కాలనీ, ఇతర కాలనీల్లో పల్స్ ఏర్పాటు చేసిన పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్ లచ్చిరెడ్డి హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో డాక్టర్లు మౌనిక, లేక శ్రీ, అక్సా పాల్, టీచర్స్ కాలనీ ఫేజ్ 2 అధ్యక్షుడు శివ, బీజేపీ నాయకులు జైపాల్ రెడ్డి, మహేష్ గౌడ్, సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు.
వనస్థలిపురం డివిజన్ పరిధిలో...
వనస్థలిపురం డివిజన్ ఆర్టీసీ కాలనీలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, జహంగీర్ కాలనీలో యూసుఫ్ బాయ్, మల్లికార్జున నగర్ కాలనీలో నిరంజన్, క్రిస్టియన్ కాలనీలో ప్రెసిడెంట్ హరేందర్ రెడ్డి, కృష్ణయ్య, రవీందర్, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. హస్తినాపురం డివిజన్ లోని భూపేష్ గుప్తానగర్ లో జరిగిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు మల్లేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.