12-10-2025 10:40:07 PM
ఎల్బీనగర్: ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ కు ప్రతిష్టాత్మక గోల్డెన్ "నంది అవార్డు" వరించింది. మక్ష్(Maksh) గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలందించిన దక్షిణ భారత వివిధ రాష్ట్రాల ప్రముఖులకు అవార్డులు అందజేశారు. వీరిలో మార్గం రాజేశ్ కు గోల్డెన్ నంది అవార్డు"ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అందజేశారు.
ఈ సందర్భంగా మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేష్ చెరిపల్లి మాట్లాడుతూ.. అనాథ విద్యార్థులను అక్కున చేర్చుకొని, వారికి అమ్మలా- నాన్నలా అన్ని తానై, ఉచిత భోజన, వసతి, ఆన్ని విద్యా సౌకర్యాలు కల్పించి, వారికి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పించి, బంగారు భవిష్యత్తుకు అహర్నిశలు కృషి చేస్తున్న రాజేష్ ను గోల్డెన్ నంది అవార్డుకు ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నల్ల బాలు, ప్రముఖ ఎంటర్ ప్రెన్యూఆర్ భవానీ, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి, తెలంగాణ ఉద్యమ నేత కోల జనార్దన్ పాల్గొన్నారు.