12-10-2025 10:20:08 PM
అమరవీరుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం..
రజాకార్ల చేతిలో అమరులైన వల్లాల అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన వి హనుమంతరావు..
నకిరేకల్ (విజయక్రాంతి): వల్లాల అమరవీరుల త్యాగం మరువలేనిది 1948 సంవత్సరంలో రజాకార్ల కాల్పుల్లో అసువులు బాసిన పదిమంది అమరవీరుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో మాజీమంత్రి కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పదిమంది అమరవీరుల కుటుంబాలకు తలొ 50 వేల రూపాయల చొప్పున పంపించిన 5 లక్షల రూపాయలను ఆదివారం వల్లాల గ్రామంలో అమరవీరుల కుటుంబాలకు ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 సంవత్సరంలో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేశారనే నెపంతో పదిమంది విద్యార్థులను రజాకార్లు కాల్చి చంపారని ఆయన తెలిపారు.
వల్లాల అమరవీరుల చరిత్రను తెలుసుకున్న వి హనుమంతరావు ఆయన సొంత ఖర్చులతో అమరవీరుల స్మారకార్థం స్థూపాన్ని నిర్మించి గత నెలలో స్తూప ఆవిష్కరణ సభ నిర్వహించిన విషయం విధితమే. భవిష్యత్తులో అమరవీరుల కుటుంబాలకు అన్ని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ వల్లాల అమరవీరుల గుర్తుకు చిహ్నంగా అత్యున్నతమైన సదుపాయాలతో గవర్నమెంట్ పాఠశాలను మంజూరు చేయించేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ శాసనసభ్యులు గోనె ప్రకాశరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, వల్లాల మాజీ సర్పంచులు ఎస్ కె ఇంతియాజ్, భూపతి వెంకన్న, దండ అశోక్, నరిగే నర్సింహా, మాధగోని రామలింగయ్య, నోముల జనార్ధన్, గవేముల గోపీనాథ్, బోడ అరుణ్ కుమార్, గుండ్ల పల్లి సైదులు, నోముల రవి, గుండ్లపల్లి శంకర్, గుండ్ల పల్లి నాగరాజు, కుర్ర లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.