calender_icon.png 13 October, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీ రోడ్డులో ఆర్టీసీ బస్ సర్వీసులు వేయాలి

12-10-2025 10:42:54 PM

మంత్రి పొన్నం ప్రభాకర్ కు కార్పొరేటర్ సుజాత నాయక్ వినతి..

ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ పరిధిలోని జడ్పీ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కార్పొరేటర్ సుజాత నాయక్ కోరారు. బీఎన్ రెడ్డి నగర్ చౌరస్తా నుంచి హస్తినాపురం జడ్పీ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులను నడిపే విధంగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను శనివారం కార్పొరేటర్ సుజాత నాయక్ కలిసి వినతిపత్రం అందజేశారు. 277 నెంబర్ బస్సును జడ్పీ రోడ్డు రూట్లో నడపాలని సూచించారు. జడ్పీ రోడ్డు నుంచి బస్సు సౌకర్యం లేక అనేక కాలనీల వాసులు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పనులపై వెళ్లేవారు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు మంత్రికి వివరించినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించినందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు.