calender_icon.png 23 May, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ

23-05-2025 01:39:25 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, మే 22 (విజయక్రాంతి): దళిత వైతాళికులు, సంఘ సంస్కర్త ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆదర్శమైన జీవితాన్ని. స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్  కొనియాడారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని  సంఘసంస్కర్త ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ రాజ్ ఎం.వి. భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ సేవలను కొనియాడారు. హైదరాబాద్ ఉన్న సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి పునాదులు వేశారని గుర్తు చేశారు.

సమాజాన్ని పట్టిపీడిస్తున్న దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థలపై ఆవిశ్రాంత పోరాటం చేసి వాటి రద్దుకు నిజాం నవాబులను ఒప్పించిన ఘనత  భాగ్యరెడ్డివర్మదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.