15-12-2025 07:43:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు మన్సూర్ నహీముద్దీన్ సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలిసి వినతిపత్రం అందించారు. మైనార్టీ వార్డులో రోడ్లు అధ్వాన్నంగా మారడంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.