15-12-2025 07:37:46 PM
మంథని (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో గెలుపొందిన మంథని మండలం నగరంపల్లి సర్పంచ్ గా ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శాలువాతో సోమవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. స్థానిక సింగిల్ విండో కార్యాలయంలో సర్పంచ్ నాతరి లత-శ్రీనివాస్, ఉపసర్పంచ్ పొరెడ్డి ప్రసన్న, తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు నౌండ్ల సదానందం, మల్యాల కిరణ్ కుమార్, తోకల శ్రీనివాస్, ఏట శ్రీనివాస్ లను చైర్మన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తమ విజయానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబులకు సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ కు గ్రామస్తులకు, నాయకులు, కార్యకర్తలకు, ప్రజాప్రతి నిధులకు సర్పంచ్, వార్డు సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం ప్రభాకర్, బూడిద రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.