23-01-2026 12:05:17 AM
నిజాంపేట, జనవరి 22: నిరుపేద కుటుంబాలకు అండగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఉన్నదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికల్లో గురువారం రోజున వివిధ గ్రామాలకు సంబంధించిన 37 మంది లబ్ధిదారులకు మం జూరైన చెక్కులను అందజేసి మాట్లాడారు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అమలు చేసే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం పలు కారణాలతో చికిత్స చేయించుకున్న 9 మంది బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.