18-01-2026 01:28:45 AM
* ‘సీబీఎస్‌ఈ చదువులకు ప్రస్తుతం యమ క్రేజ్ ఉంది. అందుకే సీబీఎస్‌ఈ సిలబస్‌పైన, స్కూళ్లపైన విద్యార్థుల తల్లిండ్రులకు మక్కువ పెరుగుతుండటంతో ఆ స్కూళ్ల సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. సీబీఎస్‌ఈ విధానంలో ప్రాక్టికల్ అప్రోచ్, సిలబస్ స్టాండర్డ్ ఎక్కువగా ఉండడంతో పేరెంట్స్ ఆ స్కూళ్లనే ఎంచుకుంటున్నారు. ఆయా పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారనే దీమా వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ సిలబస్ అందించే ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కంటే సీబీఎస్‌ఈ సిలబస్‌యే ఉత్తమమన్న భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ సిలబస్‌పైన, స్కూళ్లపైన, విద్యార్థి తల్లిదండ్రుల తీరుపైన ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.’
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): స్టేట్ సిలబస్ చదివిస్తే జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో విద్యార్థులు రాణించడం కష్టమనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో నెలకొంది. ఒకవేళ స్టేట్ సిలబస్‌ను ఎంచుకుంటే రాష్ట్రస్థాయిలోని ఎప్‌సెట్‌తోపాటు ఇతర పోటీ పరీక్షలకే పరిమితం కావాల్సి ఉంటుంది. మళ్లీ టెన్త్ తర్వాత ఇంటర్‌లో ప్రత్యేకంగా జేఈఈ, నీట్ వంటి కోర్సుల్లో చేర్పించాల్సి ఉంటుంది. అక్కడ విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. పైగా విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమం లోనే పాఠశాల స్థాయి నుంచే పిల్లలను సీబీఎస్‌ఈ స్కూళ్లలో చేర్పిస్తే భవిష్యత్‌లో పైచదువుల్లో రాణిస్తారనే ఉద్దేశంతో ఆయా స్కూళ్లనే ఎంచుకుంటున్నారు. దీనికనుగుణంగానే సీబీఎస్‌ఈ స్కూళ్ల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతోంది.
స్టేట్ బోర్డు నుంచి సీబీఎస్‌ఈకి మార్పు
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సీబీఈఎస్‌ఈ స్కూళ్ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. గత ఐదేళ్లలో వీటి సంఖ్య భారీగానే పెరిగింది. 2020లో మొత్తం 22,560 పాఠశాలలుంటే 2025 వచ్చేసరికి వీటి సంఖ్య ఏకంగా దాదాపు 31,210కి చేరింది. అదే తెలంగాణలో చూసుకుంటే 2021-22లో సీబీఈఎస్‌ఈ స్కూళ్లు దాదాపు 353 ఉంటే 2022-23లో 365కు చేరాయి. 2023-24 వచ్చేసరికి ఆ సంఖ్య కాస్త 415కు చేరగా, 2024- 25లో 457, 2025-26లో మొత్తంగా 468 ఉన్నాయి. ఈ ఐదేళ్లలో 115 వరకు స్కూళ్లు పెరిగాయి. తొలు త ఈ స్కూళ్లు స్టేట్ బోర్డు నుంచి అనుమతి తీసుకుని తర్వాత సీబీఎస్‌ఈకు మా రుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా కొన్నేం డ్ల తర్వాత స్కూళ్లు తమ అఫిలియేషన్లను మార్చుకుంటున్నాయి. పైగా సీబీఎస్‌ఈ స్కూలైతే స్టేట్ బోర్డు పెత్తనం కూడా పెద్దగా ఉండదు.
ఆ సిలబస్‌తో సీటు పక్కా..
సీబీఎస్‌ఈలో చదువుతే జేఈఈ, నీట్‌తో పాటు ఇతర పోటీ పరీక్షల్లో ఏదైనా సీటు పక్క అనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. పైగా ఈ పోటీ పరీక్షలను ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలపైనే ఆధారపడి నిర్వహిస్తున్నారు. అందుకే ఇందు లో చదివే విద్యార్థులకు ఇది కలిసొచ్చే అంశం. కాన్సెప్ట్ బేస్డ్‌లో లర్నింగ్‌కు ప్రాధా న్యం ఇస్తా రు. దీంతోపాటు ఈ స్కూళ్లలో చదివిస్తే హిందీ, ఇంగ్లిష్ భాషలే కాకుండా స్పానిష్, ఫ్రెం చ్, జర్మన్ వంటి విదేశీ భాషలపై నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. ముఖ్యం గా లాంగ్వెజెస్‌పై విద్యార్థులకు పట్టు వస్తోంది. చదువొక్కటే కాకుండా విద్యార్థులకు ఆటలు సైతం ఆడిస్తారు. ఈ స్కూళ్లు కూడా విశాలంగా ఉంటాయి. సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు పొందాలంటే నగరాల్లో కనీసం ఒక ఎకరం, గ్రామీణ ప్రాం తాల్లో రెండు ఎకరాల స్థలం ఉండాలి. అందుకే ఈ స్కూళ్లలో సీట్లకు డిమాండ్ బాగా ఉంటుం ది. కొన్ని స్కూళ్లల్లోనైతే పైరవీలు చేసినా అడ్మిషన్లు దొరకడం కష్టంగా ఉంది.
సిలబస్‌లో మార్పులు అవసరం!
తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఫౌండేషన్ బాగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే చదువు విషయంలో ఏమాత్రం రాజీ పడడంలేదు. పిల్లలకు మంచి చదువు అందిస్తే చాలనే భావనతో అప్పుచేసైనా సరే చాలా మంది పేరెంట్స్ సీబీఎస్‌ఈ పాఠశాలల్లోనే చేర్పించేందుకు ఇష్టపడుతున్నారు. అయితే అందరూ లక్షలు పోసి తమ పిల్లలను సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చేర్పించడం కష్టమవుతోంది కాబట్టి, స్టేట్ బోర్డు అందిం చే సిలబస్‌లోనూ మార్పులు చేయాలనే డిమాండ్ తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి వినిపిస్తోంది.
జేఈఈ, నీట్ వంటి సీట్లు కొడుతున్న వారిలో స్టేట్ బోర్డు నుంచి వచ్చే విద్యార్థులు తక్కువగానే ఉంటున్నారు. కొం తమంది మాత్రం ఇంటర్‌లో స్పెషల్ కోచిం గ్ తీసుకొని ర్యాంకులు సాధిస్తున్నారు గానీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడంలేదు. అందుకే స్టేట్ బోర్డులోనూ సిలబస్ లో మార్పులు చేర్పులు చేయాలంటున్నా రు. కేవలం సిలబస్ ఒక్కటి మార్చితే సరిపోదు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణతో పాటు, అర్హత గల ఉపాధ్యాయులను కూడా ఆయా పాఠశాలలు నియమించుకోవాల్సి ఉంటోంది. స్టేట్ సిలబస్ కూడా సీబీఎస్‌ఈ స్టాండర్డ్ స్థాయిలో ఉండాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది.