18-01-2026 01:31:50 AM
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): హామీల ఆమలును పక్కనపెట్టి కేవలం పేర్లు మార్చడంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గతం లో పుస్తకాల్లో చదువుకున్న తుగ్లక్ గురిం చి అందరికీ కనిపిస్తున్నదని, తుగ్లక్ అంటే ఎట్లా ఉంటాడో రేవంత్‌రెడ్డిని చూసి అ ర్థం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చే సిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ మాట్లాడా రు. చారిత్రకంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా పెద్ద నగరా లుగా విస్తరించాయని చెప్పారు.
హైదరాబాద్-సికింద్రాబాద్ తెలంగాణ ప్రజల అస్తిత్వం అని, కానీ రేవంత్‌రెడ్డి తీసుకున్న తుగ్లకు నిర్ణయం వలన సికింద్రాబాద్‌కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేలా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను, ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చెరుపడం కోసం కాదని హితవు పలికారు. హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, ఒక్క రోడ్డు కూడా వేయలేదు, ఒక ఇల్లు కూడా కట్టలేదని, కానీ నగరం మొత్తం తన విధ్వంస ప్రణాళికలతో ముందుకు పోతున్నారని మండిపడ్డారు.
శనివారం శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియు తంగా చేపట్టారని, శుక్రవారం రాత్రి వరకు అనుమతి ఉందని చెప్పి, శనివారం అనుమతి లేదని చెప్పి వేలాది మందిని, కార్పొరే టర్లను, మాజీ కార్పొరేటర్‌లను, పార్టీ సీనియర్ నాయకులను సాధారణ ప్రజలను ఎక్కడికి అక్కడ అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అరాచకంగా అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం.. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చేరిపి వేసే ప్రయత్నం మానుకో వాలని సూచించారు. మరోసారి కోర్టుకు వెళ్లి శాంతి ర్యాలీని నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు.
కేవలం శాంతి ర్యాలీ మాత్ర మే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలతో సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు. అరెస్టు చేసిన వేలాది మందిని వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొదట టీఎస్ తీసేసి టీజీ అన్నారని, ఆ తర్వాత తెలంగాణ తల్లిని మార్చారని, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారని, అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్‌ను తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటి వలన ప్రజలకి ఏమాత్రం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని కోరారు.
ప్రజల దగ్గరికి పాలన పోవాలని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని ఒక విశాల దృక్పథంతో కేసీఆర్ వీకేంద్రీకరణను ప్రారంభించారని గుర్తు చేశారు. కొత్త గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు జిల్లాలను ఏర్పాటు చేశారని, 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడంతోపాటు హైదరాబాదు లోనూ వార్డులను, జోన్లను పెంచి వాటికి అభివృద్ధి నిధులను కూడా అధికంగా ఇచ్చినట్టు గుర్తు చేశారు.
ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తాం
ప్రజల ఆశీర్వాదంతో మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత సికింద్రాబాద్‌ను మరొక జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షల మేరకు వారి డిమాండ్లన్నింటిని రాబోయే తమ ప్రభుత్వంలో నెరవేరుస్తామని స్పష్టం చేశారు. చిన్న జిల్లాలతో ప్రజల దగ్గర అధికారులు వస్తే, రాష్ట్రాల సచివాలయం కంటే గొప్పగా కట్టుకున్న సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకి పాలన అందుతుంటే రేవంత్‌రెడ్డికి ఏం సమస్య ఉందో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపైన రాహుల్ గాంధీ స్పందించాలని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆయన గుర్తించాలన్నారు.