07-07-2025 12:00:00 AM
టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా సంస్కృతిని మరవొద్దు
టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 13వ సారి ఐటీ బోనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ తెలంగాణ ప్రపంచ ఐటీ రాజధానిగా ఎదగాలని ప్రార్థించినట్టు తెలిపారు.
బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదని, మన భూమికి, భక్తికి, సంస్కృతికి ఇచ్చే ప్రాధాన్యత అని పేర్కొన్నారు. టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా సంస్కృతి మన శ్వాసలో ఉండాలని పిలుపునిచ్చారు. ఐటీ బోనాల ఊరేగింపు శిల్పకళా వేదిక వద్ద ప్రారంభమై పెద్దమ్మ ఆలయంలో ముగిసింది. ఐబీఎం, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ తదితర ప్రఖ్యాత ఐటీ సంస్థల నుంచి వెయ్యికిపైగా ఉద్యోగులు బోనాల్లో పాల్గొన్నారు.