calender_icon.png 16 September, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలి దశ ఉద్యమానికి స్ఫూర్తి దాశరథి

22-07-2024 02:52:46 AM

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. దాశరథి శత జయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో దాశరథి తన కలం నుంచి ఓ వైపు విప్లవాగ్నులను రగుల్చుతూనే మరోవైపు అనువాద, ప్రణయ కవిత్వాలను, సినీ గీతాలను వెలువరించిన సవ్యసాచి అని పేర్కొన్నారు. దాశరథి పోరాట పటిమ మలి దశ తెలంగాణ ఉద్యమ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.