calender_icon.png 16 September, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జో బైడెన్

22-07-2024 09:51:45 AM

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 2024 యుఎస్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా తిరిగి ఎన్నికయ్యే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రెసిడెంట్ జో బిడెన్ ఆదివారం ప్రకటించారు. దేశ ప్రయోజననాల కోసమే తప్పుకున్నట్లు వెల్లడించారు. ప్రెసిడెంట్ గా పూర్తికాలం కొనసాగుతానని బైడెన్ పేర్కొన్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.జో బిడెన్, తన నిష్క్రమణను ప్రకటించిన తర్వాత, డెమొక్రాట్ల కొత్త అధ్యక్ష అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఆమోదించారు. బైడెన్ వైదొలగడంపై మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా స్పందించారు. ఆయన అత్యంత ప్రభావవంతమైన అమెరికా అధ్యక్షులలో ఒకరని వ్యాఖ్యానించారు. అత్యున్నత స్థాయి దేశభక్తుడని కితాబిచ్చారు. తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా ఎవరికి మద్దతిస్తున్నారనే విషయాన్ని ఒబామా వెల్లడించకపోవడం విశేషం. బైడెన్ సంచలన నిర్ణయం ప్రపంచ నాయకులకు షాకిచ్చింది.