15-11-2025 10:32:21 PM
నవాబ్ పేట్: మండల పరిధిలోని హన్మసానిపల్లి గ్రామానికి చెందిన నిర్మలమ్మ(36) గత నెల 18న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 15 సంవత్సరాల క్రితం ఆమెకు గ్రామానికి చెందిన చెన్నారపు మల్లయ్యతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. సంసారం విషయంలో మల్లయ్య, నిర్మలమ్మ తరచూ గొడవ పడేవారు. తన కూతురు అక్షిత, భర్త మల్లయ్య ఇంట్లో నిద్రకు ఉపక్రమించగానే వారిని అక్కడే వదిలేసి నిర్మలమ్మ అక్కడి నుండి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె కోసం ఎంతగా వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో విసిగిచెంది మల్లయ్య శనివారం తన భార్య నిర్మలమ్మ ఆచూకీ కనుగొని తనకు అప్పగించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విక్రమ్ తెలిపారు.