22-07-2024 02:15:08 AM
దివ్యాంగుల కోటా అవసరం లేదంటూ సంచలన ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్
ఘాటుగా స్పందించిన శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది
స్మితను తప్పుబడుతున్న నెటిజన్లు
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు? అంటూ సీనియర్ ఏఐఎస్, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది. ఈ ట్వీట్‌లో ఆమె ప్రస్తా వించిన అంశాలు తీవ్రమైన చర్చకు దారి తీశాయి. దివ్యాంగులు అంటే తనకు గౌర వం ఉందంటూనే.. ఎయిల్‌లైన్స్‌లో వైకల్యం ఉన్న పైలెట్‌ను ఎంపిక చేస్తారా? వికలాగుండైన సర్జన్‌ను విశ్వసిస్తారా? అని ప్రశ్నిం చారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అనేవి ఫీల్డ్ వర్క్‌లు అని, వీటికి శారీర ధృఢత్వం అవసరమని స్మిత పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పని చేసే ఈ సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకని ఆమె ప్రశ్నించారు. జస్ట్‌ఆస్కింగ్ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. స్మిత చేసిన ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు స్మిత సబర్వాల్‌కు అనుకూలంగా, మరొకొందరు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్నారు. రిజర్వే షన్లలో సంస్కరణలు అవసరమని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. సివిల్ సర్వీసుల్లో అన్ని పోస్టులు క్షేత్రస్థాయిలో పని చేసేవి ఉండవు. డెస్క్ ఉద్యోగాలు కూడా ఉంటా యి. సైన్యం కంటే సివిల్ సర్వీస్ చాలా భిన్నమైనదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. స్మితా సబర్వాల్ స్పందిస్తూ.. సివిల్ సర్వీస్ కూడా ఫీల్డ్ జాబ్ అని, ప్రతిభావంతులైన దివ్యాంగులకు డెస్క్ ఆధారిత ఉద్యో గాలే సరైనవని ఆన్సర్ చేశారు.
ఎంపీ వర్సెస్ ఐఏఎస్
స్వితా సబర్వాల్ ట్వీట్‌పై శివసేన(ఉద్ధవ్) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఘాటుగా స్పందించారు. ఇలా మాట్లాడటం దయనీయమమన్నారు. బ్యూరోక్రాట్లు తమ పరిమితమైన ఆలోచనలను, ప్రత్యేకాధికారాలను ఎలా చూపిస్తారనే దానికి ఇదొక నిదర్శనమని విమర్శించారు. అయితే చతుర్వేది ట్వీట్‌కు స్మితా సబర్వాల్ ఆసక్తికరమైన బదులిచ్చారు. మేడమ్, పాలనకు సంబంధించిన సమస్యలపై బ్యూరోక్రాట్లు స్పందిం చకపోతే ఎవరు మాట్లాడుతారు. నాకు పరిమిత అనుభవం లేదు. నేను 24ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను. ఇతర కేంద్ర సేవలతో పోలిస్తే.. సివిల్ సర్వీస్‌కు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ప్రతిభావంతులైన దివ్యాంగులు ఖచ్చితంగా గొప్ప అవకాశాలను పొందుతారు అని బదులిచ్చారు.
అసలు ఎలా రాజీనామా చేస్తారు?
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంపై స్మితా సబర్వాల్ స్పందించారు. ఖేద్క ర్ విషయం ఎటూ తేలకుండా యూపీఎస్సీ చైర్మన్ ఎలా రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. అవకతవకలపై ఎవరూ తప్పించుకో లేరంటూ పేర్కొన్నారు.