1 April, 2026 | 2:51 AM

ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

07-12-2024 04:27 PM

సిఐటియు నాయకులు డిమాండ్...

రామాయంపేట: ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామయంపేటలో డివిజన్ ఆటో డ్రైవర్ల తరఫున మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు వలన నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని అన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూపాయలు 15000 ఇవ్వాలని అలాగే ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉబర్ ద్వారా అక్రమంగా నడుస్తున్న టూవీలర్లను నిషేధించాలని అన్నారు. ఆటో లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రాష్ట్రపతి చెల్లించాలని ఆక్సిడెంట్ భీమాను రూపాయలు 10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు కూడా వర్తింపజేయాలని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలన్నారు.