28-11-2025 12:50:03 AM
శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
మేడ్చల్ అర్బన్, నవంబర్ 27 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన తోటకూర వజ్రెష్ యాదవ్ ను మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వేముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.
డిసిసి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన తోటకూర వజ్రెష్ యాదవ్ నాయకత్వంలో మేమంతా కలిసి ఆయన వెంట ఉండి పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, సీనియర్ నాయకులు మధుకర్ యాదవ్, సద్ది సంజీవరెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్,బండి శ్రీనివాస్ గౌడ్,టైలర్ రాజు,దుర్గం వెంకటేష్ ముదిరాజ్,లింగం దాత్రిక,పూడూరు సత్తిరెడ్డి,నరేందర్,పత్తి ఆంజనేయులు,వేముల రంజిత్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,రఘుపతి రెడ్డి,మహిళా అధ్యక్షురాలు ప్రేమలత తదితరులు పాల్గొన్నారు..