28-11-2025 12:51:05 AM
-హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్
-గౌడ సొసైటీ అధ్యక్షుడు వల్లపుదాసు కృష్ణ
హుజూర్ నగర్, నవంబర్ 27(విజయ క్రాంతి): సీఎంఆర్‌ఎఫ్ పేద ప్రజల సంజీవని అని హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,గౌడ సొసైటీ అధ్యక్షులు వల్లపుదాసు కృష్ణ అన్నారు. గురువారం పట్టణానికి చెందిన దొంతగాని సోమయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల హాస్పిటల్ లో వైద్య చికిత్స చేయించుకుని ఆర్థిక ఇబ్బంది పడుతున్న నేపద్యంలో సీఎంఆర్‌ఎఫ్ నుండి మంజూరైన 60వేల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేసి మాట్లాడారు...హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఉత్తమ్ కృషితో భాదితులకు సకాలంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో కనకమ్మ,వార్డు ప్రజలు,పాల్గొన్నారు.