calender_icon.png 23 January, 2026 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్య

23-01-2026 12:00:00 AM

మైనార్టీ గురుకుల ప్రవేశ ప్రచార వాల్ పోస్టర్లను 

ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి

గజ్వేల్, జనవరి 22: కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న మైనార్టీ గురుకుల పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో గురుకుల ప్రవేశ ప్రచార పోస్టర్లను ప్రిన్సిపాల్ కిరణ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తుందన్నారు. కార్పొరేట్ స్థాయిలో అన్ని వస్తువులతో మైనారిటీ గురుకులాల్లో మైనారిటీ తోపాటు ఇతర సామాజిక వర్గాల విద్యార్థులకు కూడా అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రిన్సిపల్ కిరణ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు జరగనున్నాయన్నారు. తమ పాఠశాలలో విద్యను అభ్యసించడానికి ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు అభ్యర్థుల ఎంపిక, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ప్రవేశ ప్రక్రియ జరుగుతుందన్నారు. హైదరాబాద్లోని కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ కోసం ఫిబ్రవరి 12వ తేదీన స్క్రీనింగ్ పరిక్ష జరుగుతుందన్నారు.

అడ్మిషన్ల కోసం tgmreistalangana.cgg.gov.in వ్బుసైట్లో సంప్రదించాలని, మైనారిటీ వర్గాలు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలన్నింటినీ పొందాలని, దీనికి తల్లితండ్రులు పూర్తిగా సహకరించాలని తెలిపారు. అడ్మిషన్ల కొరకు నేరుగా కూడా తూప్రాన్ రోడ్ లోని పాఠశాలలో లేదా 7995057964 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మజీద్ కమిటీ సదర్ సయ్యద్ మతీన్, ఏఎంసి డైరెక్టర్ అబ్దుల్ వహీద్, నాయకులు సమీర్, నాయిని యాదగిరి, జాఫరుద్దీన్, మస్జిద్ ఇమామ్, లెక్చరర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.