23-01-2026 03:39:26 PM
స్పెషల్ ఆఫీసర్ వి. రమణ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం , ఇంటర్మీడియట్ బోర్డు వారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జి. శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది, ఈ సమావేశం కు ముఖ్యఅతిథి గా ఇంటర్మీడియట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ వి. రమణారావు విద్యార్థుల తల్లిదండ్రులను ఉదేశించి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన ప్రమాణాలతో ఉచిత విద్య లభిస్తుందని, ప్రభుత్వం కూడా కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
విద్యార్థుల అభివృద్ధిలో అటు అధ్యాపకుల పాత్ర ఎంత ముఖ్యమో ఇటు తల్లిదండ్రుల పాత్ర అంతే ముఖ్యమని అందుకే సమావేశం నిర్వహించడం జరిగింది అని , కళాశాలలో ఏర్పాటుచేసిన 'వాల్ ఆఫ్ ఫేమ్' లోనీ మీ కళాశాల పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని డి.కల్పన మాట్లాడుతూ విద్యార్థుల హాజరు మెరుగు పరచాలని క్రమం తప్పకుండ కళాశాలకు పంపాలని సూచించారు, రాబోయే పరీక్షలకు విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చూసే భాద్యత మనపై ఉందని, వారి భవిష్యత్ మన చేతులలో ఉందని తెలిపారు ,హాస్టల్ వార్డెన్ అంజయ్య, తల్లిదండ్రులు పద్మ, రాంచందర్, శ్రీనివాస్, యశోద, శ్యామల, భాగ్యలక్ష్మి, హరికృష్ణ తదితరులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు దేవేందర్, మాధవిలత, ప్రభాకర్, నిర్మల, గణేష్, హరికృష్ణ, సునీల్, రాజశేఖర్, రమేష్, రాజేందర్, అర్జున్, అరుణ, విక్రమ్, మమత, వంశి, లైబ్రేరియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.