23-01-2026 03:40:46 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఖానాపూర్ ప్లస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా కొన్ని ఏళ్లుగా జర్నలిస్టులుగా పని చేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు ప్రతి ఏటా జనవరి 26న ఉత్తమ జర్నలిస్టుల అవార్డుల ప్రధానం లో ఖానాపూర్ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోళ్ల రాజేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ తన్వీర్ ,సమన్వయకర్త పాలిక్ శ్రీనివాస్ ,సీనియర్ జర్నలిస్టులు ఆసూరి సంతోష్ ,పుప్పాల శేఖర్, సాంకేత్ వర్ధన్, కైసర్, సిరిగారపు శంకర్, సాజి త్ ,తదితరులు ఉన్నారు.