23-01-2026 03:35:52 PM
హనుమకొండ,(విజయ కాంతి): నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సంధర్భంగా హనుమకొండ చౌరస్తా లోని నేతాజీ విగ్రహానికి నేతాజీ సేన అధ్యక్షులు మార్క సునీల్ కుమార్ గౌడ్ పూలమాల వేసి నివాళి అర్పించారు.అనంతరం సునీల్ కుమార్ గౌడ్ మాట్లాడుతు దేశ స్వాతంత్ర ఉద్యమంలో అగ్నిజ్వాల లా నిలిచిన మహానేత ను గౌరవించుకోవలసిన బాధ్యత మనందరిది అన్నారు.నీవు నాకు రక్తం ఇవ్వు, నేను నీకు స్వాతంత్ర్యం ఇస్తాను అనే ఆయన పిలుపు తో ఆజాద్ హిందూ ఫౌజ్ వంటి సంస్థ ఏర్పాటు చేసి యువతను స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొనేలా చేశారన్నారు.హనుమకొండ చౌరస్తా ను నేతాజీ చౌరస్తాగా గా పేరు మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నేతాజీ లాంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి యువతరానికి తెలిసే విధంగా ప్రభుత్వం మరింత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తైలం వేణుగోపాల్, వలుస అశోక్, గండ్రాతి రాజు, చీకటి రాజు, సూరాసీ మహేష్, లక్కాకుల రాజు, కొంగర ప్రభాకర్, మాధవషా, మచ్చ రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.