calender_icon.png 23 January, 2026 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణరావుపేటలో ఘనంగా ఓటర్ల దినోత్సవం

23-01-2026 03:37:52 PM

సిద్దిపేట రూరల్ జనవరి 23: నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహశీల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నైతికంగా ఓటు హక్కును వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. 

అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొంగురం ఎల్లారెడ్డి, ఉప సర్పంచ్ బింగి నవీన్, స్థానిక ఎస్సై రాజేష్ ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అలాగే ఎంఆర్ఓ జయంత్, కార్యాలయ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పాఠశాల ఇంచార్జ్ నరసింహాచారి, ఉపాధ్యాయ బృందం పర్యవేక్షణలో విద్యార్థులు క్రమశిక్షణతో పాల్గొనగా, ఓటు విలువపై ప్రజాస్వామ్య స్పృహను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా నిలిచింది.