calender_icon.png 29 November, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు దేవిప్రసన్న

29-11-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 28, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన తోట దేవిప్రసన్న శుక్రవారం హైదరాబాదు లో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఎంతో నమ్మకంతో తనకు ఈ బా ధ్యతలు అప్పగించినందుకు మహేష్ కుమా ర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ భద్రాద్రి డీసీసీ అధ్యక్షులు తోట దేవిప్రసన్న ను అభినందించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలో పేతం చేసేందుకు నాయకుల్ని అందరిని కలుపుకొని వెళ్ళాలని, ప్రజా ప్రభుత్వం చేస్తు న్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, పార్టీని బూత్ స్థాయి నుంచి బల పర్చేందుకు కృషి చేయాలని, రాబోయే స్థా నిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా కార్యాచరణ తయారు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఆమె వెంట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కా ర్తీక్, కాంగ్రెస్ పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ ఉన్నారు.