29-11-2025 12:00:00 AM
భద్రాచలం, నవంబర్ 28, (విజయక్రాంతి):అమ్మకు పుణ్యక్షేత్రమైన భద్రాచలం లో జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడానికి జిల్లా కలె క్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం నాడు భ ద్రాచలం దేవాలయం ప్రాంతంలో పర్యటిం చి దేవాదాయ శాఖ చేపడుతున్న ఉత్సవ ఏ ర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవస్థానం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తర దార దర్శనం భ క్తులతో పాటు వీవీఐపీలు కూడా దర్శించుకునే అవకాశం ఉన్నందున వచ్చిన వారం దరూ ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాటు చేయాలని కోరారు. అం తేకాకుండా కళ్యాణ మండపం వద్ద అధ్యయ న వేదిక చట్టాలు ఏర్పాట్లు గురించి కూడా చర్చించి గడువు లోపల అన్ని పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
గోదావరి నది తీరంలో జరిగే తేప్పోత్సవం కార్యక్రమం కూ డా వైభవంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు.ఈ కా ర్యక్రమంలో కలెక్టర్ వెంట భద్రాద్రి దేవస్థానం ఈవో కె దామోదర్ రావు, ఇంజ నీరింగ్ విభాగం ఈ ఈ వి రవీంద్రనాథ్, ఏ ఈ ఓ లు శ్రవణ్ కుమార్ భవాని రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు