calender_icon.png 17 August, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల్ గ్రామంలో డీసీసీబీ శాఖ ప్రారంభం

13-08-2025 01:10:04 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): యాచారం మండలంలోని మాల్ గ్రామంలో నూతన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ శాఖను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మంగళశారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ.. మాల్ వంటి పెద్ద వ్యాపార కేంద్రంలో డీసీసీబీ శాఖ స్థాపనతో రైతులు, వ్యాపారులు, ఖాతాదారులు సమీపంలోనే సమగ్ర ఆర్థిక సేవల ను పొందగలరు అని చెప్పారు.

ఈ బ్యాంక్ సేవలు యాచారం మండలంతో పాటు మాడ్గుల, చింతపల్లి, మర్రిగూడ (నల్గొండ) వంటి పరిసర మండలాల రైతులకు కూడా అందుబాటులో ఉంటాయి. త్వరలో మాల్ లో కొత్త పీఏసీఎస్ ఏర్పాటు కాబోతోంది. దీని ద్వారా సుమారు 3,500 మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్లు చంద్రశేఖర్, ఆనంద్, డీసీసీబీ  జీఎంలు ప్రభాకర్ రెడ్డి, డీజీఎంలు, ఏజీఎంలు, ఇబ్రహీంపట్నం ఎఎంసి మార్కెట్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, యాచారం పాక్స్ చైర్మన్ తోట రాంరెడ్డి, ఉప్పరగూడ పాక్స్ చైర్మన్ పాండురంగ రెడ్డి, మంచాల పాక్స్ చైర్మన్ హనుమంత్ రెడ్డి,  రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.