13-08-2025 01:11:24 AM
-ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఆగ్నేయాసియాలోనే తొలి తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో ప్రోస్టే ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధపడుతున్న రోగులకు విజయ వం తంగా చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా కిమ్స్ హాస్పిటల్స్ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఈ చికిత్సను డే కేర్ విధానం లో నిర్వహించారు. ఇప్పటివరకు బహ్రెయిన్, దుబాయ్, మారిషస్లకు చెందిన ము గ్గురు విదేశీయులు సహా 13 మంది రోగులకు విజయవంతంగా చికిత్స చేశారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలు ఇటీవలి కాలంలో పురుషు ల్లో వేగంగా పెరుగుతున్నాయి. సాధారణంగా వీటి కోసం క్లిష్టమైన శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. అయితే, ఒక ముఖ్యమైన పురో గతిగా కిమ్స్ ఆసుపత్రులు తుల్సా -ప్రో (ట్రాన్స్యూరేథ్రల్ అల్ట్రాసౌండ్ అబ్లేషన్ ప్రోస్టేట్) సిస్టమ్ను పరిచయం చేశాయి. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆగ్నేయా సియాలో ఇదే మొట్టమొదటిగా నిలిచింది. మంగళవారం కిమ్స్ ఆసుపత్రుల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు ఈ అత్యాధునిక పరికరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ.. “రోగులకు ప్రపంచంలోని తాజా వైద్య విధానాలను చేరవేయడంలో కిమ్స్ కట్టుబడి ఉంది. తుల్సా-ప్రోతో, ఇప్పు డు మేము ప్రోస్టేట్ చికిత్సలో సంపూర్ణ సేవలను అందిస్తున్నాం” అని చెప్పారు. కార్యక్ర మంలో కిమ్స్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యూరో-ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జ న్ డాక్టర్ లిఖితేశ్వర్ పల్లగాని, కార్యక్రమం లో కిమ్స్ యూరాలజీ, శస్త్రచికిత్స బృందంలోని ప్రముఖులు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, డాక్టర్ కె.వి.ఆర్. ప్రసాద్, డాక్టర్ నీల్ నరేంద్ర త్రివేది తదితరులు హాజరయ్యారు.