calender_icon.png 17 August, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే సుస్థిర పాలన సాధ్యం

13-08-2025 01:09:24 AM

మండల వ్యాప్తంగా రూ. 8. 71 కోట్ల అభివృద్ధి పనులు 

యాచారం ఆగస్టు 12 :కాంగ్రెతోనే సుస్థిర పాలన సాధ్యమవుతుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.మంగళవారం యాచారం మండల పరిధిలో రూ. 8.71 కోట్ల తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మాల్ లో రూ. 85 లక్షలతో నూతనంగా నిర్మించిన కో-ఆపరేటివ్ భవనాన్ని ప్రారంభించారు .

అ నంతరం సాయి శరణ గార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల వ్యాప్తంగా సుమారు 50 00 మందికి నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు .మేడిపల్లి, నానక్ నగర్, గ్రామాలలో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లకు, శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పేద వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి చి త్త శుద్ధితోపనిచేస్తున్నారన్నారు.

త ప్రభుత్వ హయాంలో లబ్దిదారులకు కాకుండా పార్టీ నాయకులకు పథకాలు అందించినట్లు ఆయన విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదల సం క్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పారదర్శకంగా సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య , ఇబ్ర హీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి , కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్రెడ్డి, వైస్ చైర్మన్ కారింగ్ యాదయ్య, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.