calender_icon.png 2 December, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో కైలాస సామూహిక వాయిద్యం

01-12-2025 11:48:21 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): భోలక్ పూర్‌లోని ప్రసిద్ధిగాంచిన భవాని శంకర ఆలయంలో సోమవారం ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్ శాఖ ఆధ్వర్యంలో కైలాస సామూహిక వాయిద్య భజన, శివ భక్తి గీతాల ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శివలింగాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్ శాఖ ప్రతినిధులు స్వామి ఎస్టీర్, మా చిత్రవాహ, స్వామి బెకూర, భాను, తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సురేష్‌కుమార్ పాల్గొన్నారు.