01-12-2025 11:46:09 PM
విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి
ముషీరాబాద్ (విజయక్రాంతి): సర్వ మానవాళి మనోవికాస గ్రంథం భగవద్గీత అని మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి అన్నారు. ఈ మేరకు సోమవారం బొగ్గులకుంటలోని తెలంగాణ సార్వస్వత భవన్‌లో నక్క వెంకటమ్మ, యాదవ్ నక్క యాదగిరి, స్వామి యాదవ్ ఎడ్యుకేషనల్ స్పోరట్స్ ఫౌండేషన్, గీతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా నక్క శ్రీనివాస్ యాదవ్, పి. బడే సాబ్ నిర్వాణలో ఏర్పాటు చేసిన గీతా మహోత్స వం సభ, శ్రీ భగవద్గీత సంపూర్ణ పారాయణం పాఠశాల విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు, పెద్దలకు శ్రీ భగవద్గీత పట్టణ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఓలేటి పార్వతీశం వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేవి రమణాచారి చేతుల మీదుగా విద్యార్థులకు, పెద్దలకు బహుమతుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వ మానవాళి మనోవికాస గ్రంథం భగవద్గీత అని విద్యార్థిని విద్యార్థులు, పెద్దవాళ్లు ఎవరైనా సరే ఇప్పటినుండి అయినా భగవద్గీతను చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. భగవద్గీత అంటే కేవలం మత గ్రంథమే కాదు.. అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి విశ్లేషకులు రామకృష్ణ చంద్రమౌళి, గంట మనోహర్ రెడ్డి, బాలాచారి, సరోజినీ దేవి, రాధాకుసుమ, ప్రజ్ఞా రాజు, గజవల్లి సత్యనారాయణ, పిఎస్‌ఎస్ వి. ప్రసాద్ క్యాటర్స్ అధినేత వైష్ణవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.