31-01-2026 05:47:50 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా గ్రామంలోని మానేటి రంగనాయక స్వామి దేవాలయం వద్ద సమ్మక్క సారలమ్మ దేవతలను శనివారం పెద్దపల్లి డిసిపి భూక్య రామిరెడ్డి, ఎసిపి గజ్జి కృష్ణులు దర్శించుకొని ఎత్తు బంగారం సమర్పించారు. సిఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ లు మన దేవతలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, సర్పంచ్ కాంపల్లి సతీష్, ఈవో శంకరయ్య జాతర కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.