31-01-2026 05:53:46 PM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సామ్ కోషి
కామారెడ్డి, జనవరి 31 (విజయక్రాంతి): బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి సామ్ కోషి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి లో మహిళలు, పిల్లల రక్షణ_ సామాజిక బాధ్యత అనే అంశంపై గ్రామపంచాయతీ కార్యదర్శులు కమ్యూనిటీ పెద్దలు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు స్వయం సహాయక సంఘాల సభ్యులు కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యా యమూర్తి న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వా హా అక్క చైర్మన్ సామ్ కోషి హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ప్రతి పౌరుడు బాధ్యత వహించాలన్నారు. 18 సంవత్సరాలు నిండని బాలికకు 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహము చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. వివాహాలకు పాల్పడే తల్లిదండ్రులకు, మధ్యవర్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గౌరవ అతిథిగా హాజరైన జస్టిస్ నందికొండ నర్సింగరావు హాజరై మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ, మహిళలపై వేధింపుల నిరోధానికి చట్టాలపై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపారు. మహిళలు పిల్లల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవలు సంస్థలు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా పోష్ చట్టం, బాల్య వివాహాల నిషేధం పై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాలనుంచి రక్షించబడిన ముగ్గురు పిల్లలు, ఆరుగురు కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారులు, బాన్సువాడ కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వాలంటీర్లు ఐదుగురు చేసిన కృషిని ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలు అందజేశారు.
పోలీస్ కళాజాత బృందం మహిళలు పిల్లల రక్షణ పై అవగాహన కలిగించే స్కిట్ ను ప్రదర్శించారు. చివరగా సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ సుర సోమలత వందన సమర్పణ చేయగా, జిల్లా న్యాయ సేవా కార్యాలయంలో మదర్ ఫీడింగ్ క్యాబిన్ ను ప్రారంభించారు. అనంతరం బారాసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బా బార్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్, న్యాయవాదులు, న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలతో మమేకమైన పంచాయితి కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, సెల్ఫ్ అండ్ హెల్ప్ గ్రూప్ సబ్యులు బాల్య వివాహాలు అరికట్టడం, చిన్నారులకు పోషకాహారం అందించడం, అవగాహన కల్పించడంలో ముఖ్యపాత్ర వహించాలి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్య నిర్వాహక చైర్మన్ జస్టిస్ పి.సామ్ కోషీ శనివారం జిల్లా కేంద్రం లోని కళాభారతి లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కామారెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ వారి సంయుక్త ఆద్వర్యంలో మహిళలు, పిల్లల రక్షణ – సామాజిక బాధ్యత అనే అంశంపై గ్రామ సెక్రటరీలు, కమ్యూనిటీ పెద్దలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్ గౌరవనీయులు జస్టిస్ పి.సామ్ కోషీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కామారెడ్డి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ అతిథి గౌరవంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవనీయ అతిథులను జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎం. సుష్మ వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం దీప ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్వాగత ఉపన్యాసం ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి డా.చి.వి.ఆర్.ఆర్. వరప్రసాద్ అందించారు.
జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, అదనపు జిల్లా కలెక్టర్ వి.విక్టర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల తమ ప్రసంగాల్లో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించడంలో సమాజం కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అతిథి గౌరవంగా హాజరైన జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ మాట్లాడుతూ, బాల్య వివాహాల నివారణ, మహిళలపై వేధింపుల నిరోధానికి చట్టాలపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరమని తెలిపారు.
ముఖ్య అతిథి గౌరవనీయులు జస్టిస్ పి. సామ్ కోషీ మాట్లాడుతూ... బాల్య వివాహాలు సమాజానికి శాపంగా మారాయని, ఇవి చట్టరీత్యా నేరమని బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్ తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండని బాలికకు, 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహం చేయడం చట్ట విరుద్ధమని, దీనికి పాల్పడిన తల్లిదండ్రులు, పెద్దలు, మధ్యవర్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని, ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే చైల్డ్ లైన్ 1098 లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బాలికల హక్కులను కాపాడటానికి, వారి విద్యను ప్రోత్సహించడానికి సమాజం మొత్తం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. POSH చట్టం , బాల్య వివాహాల నిషేధ చట్టాల అమలులో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మహిళలు, పిల్లల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవల సంస్థలు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా రానున్న సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో ఎలాంటి కేసులు ఉండకుండా జిల్లాను ముందుంచాలని అన్నారు.
ఈ సందర్భంగా POSH చట్టం , బాల్య వివాహాల నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల నుంచి రక్షించబడిన పిల్లలు (3), కేజీబీవీ పాఠశాలల ప్రత్యేక అధికారులు (6), బాన్సువాడ కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వాలంటీర్లు (5) సోషల్ మీడియా అవగాహన కార్యక్రమాల్లో కృషి చేసిన ఉపాధ్యాయుడికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు వృద్ధులకు వీల్ చైర్లు, “పీపుల్ ఫర్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్” అనే ఎన్‌జీఓ ద్వారా ఐదుగురు మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పోలీస్ కళాజాత బృందం మహిళలు, పిల్లల రక్షణపై అవగాహన కలిగించే స్కిట్‌ను ప్రదర్శించారు. చివరగా సీనియర్ సివిల్ జడ్జి డా. సుర సుమలత వందన సమర్పణ అనంతరం న్యాయ సేవా కార్యాలయం లో మధర్ ఫీడింగ్ క్యాబిన్ ప్రారంభించి, బార్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయమూర్తి డాక్టర్ వి వి ఆర్ వరప్రసాద్, న్యాయమూర్తులు నాగరాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్, న్యాయవాదులు, న్యాయ సేవ సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు, ఎన్జీవో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.