31-01-2026 09:04:43 PM
ఏవో వెంకటకృష్ణ
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఎఫ్‌బీఓ, ఎఫ్‌ఎస్‌ఓగా కెరమెరి రేంజ్ పరిధిలో సేవలందించిన లాల్ మా నాయక్ పదవీ విరమణ సందర్భంగా జిల్లా కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అటవీ శాఖ అడ్మినిస్ట్రేటివ్ అధికారి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడమే నిజమైన గౌరవమని అన్నారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అటవీ సిబ్బంది లాల్ మా నాయక్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వివిధ రేంజ్‌ల సిబ్బంది పాల్గొన్నారు.